News February 3, 2025

సూర్యాపేట: మూడున్నర కిలోల మొరంగడ్డ 

image

సాధారణంగా ఒక మొరంగడ్డ 200, 300 గ్రాములుంటుంది. కానీ చిలుకూరులో మాత్రం ఓ రైతు చేనులో కాసిన మొరంగడ్డ ఏకంగా మూడున్నర కిలోలు ఉంది. గ్రామానికి చెందిన అలసకాని వెంకటయ్య పొలంలో బావిగడ్డకు సెప్టెంబర్‌లో మొరంగడ్డ తీగను నాటాడు. నాలుగు నెలల తర్వాత బావి గడ్డను తవ్వగా మూడున్నర కిలోల మొరంగడ్డ వచ్చిందని చెప్పారు. దానిని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. 

Similar News

News February 11, 2025

ములుగు: 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్

image

రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంఈవోలు, హెచ్ఎంలు కృషి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ఇంటి వద్ద చదివేలా కృషి చేయాలన్నారు.

News February 11, 2025

మెదక్: శవం వద్ద మెడికల్ విద్యార్థుల ప్రమాణం

image

మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్‌కి ముందు వారికి విజ్ఞానాన్ని పంచే శవం వద్ద ప్రమాణం చేశారు. ఎల్లప్పుడు గౌరవాన్ని, విఘ్నతను కలిగి ఉంటామని కృతజ్ఞులమై ఉంటామని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ జయ, అనాటమీ విభాగం డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2025

ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

error: Content is protected !!