News February 11, 2025
సూర్యాపేట: రిటర్నింగ్ అధికారుల నియామకం

త్వరలో జరగనున్న ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మండలాల వారీగా రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మండలాలకు వివిధ శాఖల విభాగ అధిపతులను ఎంపిక చేశారు. మిగతా సిబ్బంది ఎంపిక జరుగుతోందని తెలిపారు.
Similar News
News November 5, 2025
బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీం కోర్టులో పోరాటానికి నిర్ణయం

TG: AP బనకచర్ల ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నీటిపారుదల, జల వనరుల నిపుణుల నుండి అభిప్రాయం తీసుకుంటోంది. CM రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన ఫైల్ను పంపి ఆయన ఆమోదించిన వెంటనే SCలో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టులపై TG ఇప్పటికే జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
News November 5, 2025
KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్

TG: సవాళ్లు విసిరి పారిపోవడం KTRకు అలవాటేనని CM రేవంత్ అన్నారు. ఆయన విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోరని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై జీవోలు ఇస్తామని, కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట్ రోడ్ షోలో ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
News November 5, 2025
VJA: దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మని సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. ఏపీ సీఎం కుటుంబ సంబంధీకుడైన రోహిత్ దంపతులకు దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ, స్వాగతం పలికారు. అనంతరం, ఛైర్మన్ ఈఓ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.


