News January 2, 2025
సూర్యాపేట: రూ.1,500 కోసం కొట్టుకున్న పోలీసులు
రూ.1,500 కోసం కానిస్టేబుల్, హోంగార్డు ఘర్షణ పడిన ఘటన పెన్‌పహాడ్‌లో జరిగింది. SI గోపికృష్ణ తెలిపిన వివరాలు.. పెన్‌పహాడ్‌లో ఓ టీ స్టాల్ దుకాణదారుడు కానిస్టేబుల్ రవికుమార్‌కు, హోంగార్డు శ్రీనుకు రూ.1500 క్రిస్మస్ ఇనాం ఇచ్చాడు. వీటిని పంచుకునే విషయంలో DEC 28న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం SP సన్‌ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్లగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డును SPఆఫీస్‌కు అటాచ్ చేశారు.
Similar News
News January 8, 2025
NLG: ప్రాణాలు తీస్తున్న పొగమంచు!
వెన్నులో వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉ. 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై వాహనాలు కనిపించక పరస్పరం ఢీకొని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇటీవల నల్గొండలో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News January 8, 2025
చైనా మాంజా వాడకం నిషేధం: నల్గొండ ఎస్పీ
నల్గొండ జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేధించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజా చాలా ప్రమాదకరమని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. పతంగులకు నైలాన్, సింథటిక్‌తో చేసిన చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరదా కోసం చేసే ఈ పని ప్రాణాల మీదకు తెస్తుందన్నారు.
News January 7, 2025
NLG: మెస్ మెనూపై అధికారుల స్పందన
ఎంజీ యూనివర్శిటీ కృష్ణవేణి వసతి గృహంలో విద్యార్థినులకు గొడ్డుకారం పెట్టిన ఘటనపై విశ్వవిద్యాలయ అధికారులు స్పందించారు. హాస్టల్స్ డైరెక్టర్ డా.దోమల రమేష్, డిప్యూటీ డైరెక్టర్ డా సాంబారు కళ్యాణి నేతృత్వంలో వార్డెన్లు రాజేశ్వరి, డా.జ్యోతి ప్రత్యక్షంగా వసతి గృహానికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థినుల భాగస్వామ్యంతో వారి నచ్చిన మెనూ ప్రకారమే నిర్వహణ జరుగుతుందని తెలిపారు.