News March 16, 2025
సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ సీఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.
Similar News
News November 19, 2025
కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో విషాదం

కాట్రేనికోన మండలం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి దర్శనానికి వచ్చిన బొట్టా నిర్మల (67) గుండెపోటుతో మృతిచెందారు. భక్తురాలు నిర్మల స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయం బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
News November 19, 2025
మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
News November 19, 2025
కృష్ణా: 1.33 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1,33,856 మంది రైతులకు 2వ విడత రూ. 88.49 కోట్ల ఆర్థిక సాయం మంజూరైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మెగా చెక్కును మంత్రి రవీంద్ర రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపిచంద్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని, తదితరులు పాల్గొన్నారు.


