News March 16, 2025
సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ సీఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.
Similar News
News April 10, 2026
TU: ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు

టీయూ చేపట్టిన జాతీయ సదస్సు రెండో రోజు(ముగింపు) సదస్సులో ఓయూ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ ప్రొ.రోజా రాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. క్రిస్పర్ టెక్నాలజీ వంటి ఆధునిక విధానాలు వైద్య, వ్యవసాయ రంగాల్లో జన్యు పరిణామాలు, జన్యు సర్దుబాటు వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. డా.సుమలత పలు అంశాలపై ప్రసంగించారు. కన్వీనర్ డా.ప్రసన్న షీలా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్మయి పాల్గొన్నారు.
News April 10, 2026
వ్యాసాశ్రమ శతాబ్ది వేడుకలు వాయిదా

ఏర్పేడు వ్యాసాశ్రమంలో మే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాల్సిన శతాబ్ది వేడుకలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. రోజూ సుమారు 10,000 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమం చేయాల్సి ఉంటుందని చెప్పారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో కష్టమని చెప్పారు. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వేడుకలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఓసారి వేడుకలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
News April 10, 2026
HNK: ‘మిల్లు కెపాసిటీని బట్టి ధాన్యం అలాట్’

హనుమకొండ కలెక్టరేట్‌లో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో అదనపు కలెక్టర్ రవి సమీక్షా సమావేశమయ్యారు. ధాన్యం రవాణాలో పారదర్శకత కోసం అలాట్‌మెంట్ ఆర్డర్స్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. ప్రతి పీపీసీ సెంటర్‌ను ఒక రైస్ మిల్లుకు ట్యాగింగ్ చేస్తామని,మిల్లు కెపాసిటీని బట్టే ధాన్యం కేటాయింపులు ఉంటాయన్నారు. ట్యాగింగ్ ఉత్తర్వులు ఉన్న మిల్లుల్లోనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.


