News April 5, 2024

సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ మృతి

image

సూర్యాపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సరిత మృతి చెందారు. ఆటోలో ఉన్న లావణ్య, పావని అనే మరో ఇద్దరు టీచర్ల పరస్థితి విషమంగా ఉంది. వీరిలో లావణ్యను మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. వారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News January 25, 2025

ప్రజాపాలన గ్రామసభలో 1,17,655 దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలోని నాలుగు రోజులు గ్రామసభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నాలుగు పథకాలకు 1,17,644 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసాకు 844, రేషన్ కార్డులు 53,844, ఇందిరమ్మ ఇళ్లు 47,471,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు15,485 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

News January 25, 2025

NLG: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల ఆహ్వానం

image

2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సహాయం కొరకు వివిధ రకాల దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల వయవృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు tsobmms.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 25, 2025

హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రామీణ, గిరిజన, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం .శివాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ అనే పథకంలో భాగంగా పర్యాటక, గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు ఇంటిలోనే తాత్కాలిక నివాస యోగ్యం కల్పించే హోమ్ స్టే కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.