News February 27, 2025
సూర్యాపేట: వచ్చే ఏడాది ట్యాబ్ల ద్వారా టీచింగ్

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే సెలెక్ట్ చేసిన పాఠశాలలకు కంప్యూటర్ల సరఫరా ప్రారంభించగా త్వరలో ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్లను అందించనున్నారు. ఈ లెక్కన ఎంపికైన 22 స్కూళ్లకు 550 ట్యాబ్లను సరఫరా చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటి ద్వారా బోధించనున్నారు.
Similar News
News November 22, 2025
రాజాంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం

రాజాం మండలం బొద్దాం సమీప తోటలో శుక్రవారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గరివిడి మండలం దుగ్గివలసకి చెందిన చెందిన అమ్మాయి, రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన అబ్బాయి పెద్దలు పెళ్లికి ఒప్పుకోరన్న భయంతో హానికారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చారు. వైద్యులు ఇరువురిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
News November 22, 2025
పల్నాడు: కన్నమదాసు మేడ గురించి తెలుసా..?

పల్నాడు సర్వ సైన్యాధిపతి మాల కన్నమ దాసు మేడ కారంపూడి నడి బొడ్డున నేటికీ ఉంది. బ్రహ్మనాయుడు మాల కన్నమ దాసుని దత్తపుత్రుడుగా స్వీకరించి పల్నాడు రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశారు. అయితే కులం కారణంగా కన్నమదాసుతో కారంపూడి రణక్షేత్రంలో యుద్ధం చేయడానికి ప్రత్యర్థులు నిరాకరించారు. కన్నమదాసు నాగులేరు ఒడ్డున మేడ నిర్మించుకొని అక్కడ నుంచే యుద్ధ పర్యవేక్షణ చేసినట్లు ప్రతీతి.
News November 22, 2025
సిరిసిల్ల CESS కార్యాలయంలో గదుల మార్పునకు సన్నాహాలు..!

సిరిసిల్ల సెస్ కార్యాలయంలో వాస్తు సరిగ్గా లేదంటూ పూజలు నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయితే గత కొంతకాలంగా పాలకవర్గం పనితీరుపై వరుసగా విమర్శలు వస్తున్నాయి. కాగా, స్వామీజీ సూచనల మేరకు వాస్తు సరిగ్గా లేని గదుల్లో మార్పులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


