News March 23, 2025
సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు. సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 22, 2025
పెంచలకోన వాటర్ఫాల్స్కు రాకండి: ఎస్ఐ

భారీ వర్షాల నేపథ్యంలో రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పెంచలకోన ఆలయ సమీపంలో ఉన్న వాటర్ఫాల్స్కు వర్షపు నీరు భారీగా వస్తోందని చెప్పారు. ప్రజలు ఎవరూ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని కోరారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్ ఫాల్స్ వద్దకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
News October 22, 2025
సిరిసిల్ల: జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలు: MLA

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుని మద్దతు ధర పొందాలని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ కోరారు. కొనరావుపేట మండలం కనగర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిరిసిల్ల అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
News October 22, 2025
అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తాం: బొత్స

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.