News March 23, 2025
సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు. సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 25, 2025
ఎనుమాముల మార్కెట్ వ్యాపారులు, రైతులకు ముఖ్య గమనిక

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యాపారులకు, రైతులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సరుకుల బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిర్చి బీటు ఉ.7.05 ని.కు, పత్తి బీటు 8:05 ని.కు, పల్లికాయ ఉ.8:15 ని.కు, పసుపు బీటు 8:30కి, అపరాలు, ధాన్యం బీటు 8:45 ని.కు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం నుంచి 11-06-2025 బుధవారం వరకు ఈ బీటులో మార్పులుంటాయన్నారు.
News April 25, 2025
మద్దూరు: రెవెన్యూ సదస్సులు పరిశీలించిన కలెక్టర్

మద్దూరు మండలం భీమ్ పూర్, నాగంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల నుంచి అందిన అర్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
News April 25, 2025
ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం