News January 26, 2025
సూర్యాపేట: సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ దిశా నిర్దేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి శ్రీకారం చుడతామని కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ తెలిపారు.శనివారం సూర్యాపేట కలెక్టర్ సమావేశ మందిరం వేబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.
Similar News
News February 24, 2026
ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ విద్యార్థుల పరీక్షా ఫీజు షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. 2022-2026 బ్యాచ్‌ల సెమిస్టర్ 1 నుంచి 6 వరకు రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 16 వరకు, రూ.100 జరిమానాతో మార్చి 18 వరకు గడువు ఉందని సీఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 24, 2026
జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.
News February 24, 2026
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీఎస్

పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు జిల్లా అధికారులకు సూచించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు పలువురు అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలు, పీఎం శ్రీ పాఠశాలలు, సమగ్ర శిక్ష అభియాన్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


