News March 28, 2025
సూర్యాపేట: సన్నబియ్యానికి రూ.857.76 కోట్ల ఖర్చు

ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో సన్నబియ్యం కోసం ప్రభుత్వం రూ.857.76 కోట్లను ఖర్చు పెట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కొత్త కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాలో 4,66,522.. సూర్యాపేట జిల్లాలో 3,05, 564.. యాదాద్రి జిల్లాలో 2,17,072 రేషన్ కార్డులున్నాయి.
Similar News
News December 12, 2025
మహిళలకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!

TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు అందించిన ‘సహేలీ’ తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డులపై లబ్ధిదారుల ఫొటో, వివరాలు ఉంటాయి. ఈ కార్డులు వస్తే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం తప్పనుంది.
News December 12, 2025
జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. అత్యల్పంగా నేరెళ్లలో 8.6℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు రాఘవపేటలో 9.1, గుల్లకోట 9.3, తిరుమలాపూర్ 9.4, మన్నెగూడెం 9.4, పూడూర్ 9.4, జగ్గసాగర్ 9.6, కథలాపూర్ 9.6, రాయికల్ 9.7, అయిలాపూర్ 9.7, వెల్గటూర్ 9.7, మల్యాల 9.8, పెగడపల్లి 9.8, కోరుట్ల 9.9, సారంగాపూర్ 9.9, గొల్లపల్లె 9.9, గోవిందారం 9.9, మద్దుట్ల 10.0, బుద్దేశ్పల్లిలో 10℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News December 12, 2025
‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్

‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మ.1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల పెంపుపై పిటిషన్ను విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను రద్దు చేసింది.


