News February 15, 2025
సూర్యాపేట: సీఎం రేవంత్ రెడ్డికి ఈ-మెయిల్

రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులపై ,జడ్జీలపై, కక్షిదారులపై దాడులు జరగకుండా ఒక గన్మెన్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మునగాల మండల న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు. రాత్రి వేళల్లో కోర్టు కాపలాకు సెంట్రింగ్ని నియమించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Similar News
News November 1, 2025
నమ్మకం, ఆత్మస్థైర్యమే బిర్సా ముండా ఆయుధాలు: కలెక్టర్

బిర్సా ముండా జయంతి సందర్భంగా గుంటూరులోని గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘జాతీయ గౌరవ దివాస్’ నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా ఆయుధాలను కాకుండా నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఆయుధాలుగా చేసుకున్నారని ఆమె కొనియాడారు. ప్రజలు బిర్సా ముండాను ప్రేమతో ‘ధర్తీ ఆభా’ అని పిలిచేవారని చెప్పారు.
News November 1, 2025
తిరుమల కొండపై విశేష పర్వదినాలు

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం
News November 1, 2025
DRDOలో 105 పోస్టులు.. అప్లై చేశారా?

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు NOV 4లోపు అప్లై చేసుకోవాలి. apprenticeshipindia.gov.in పోర్టల్ ఎన్రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in/


