News March 9, 2025
సూర్యాపేట: సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం

కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ పేరును సీపీఐ ప్రకటించాల్సి ఉంది.
Similar News
News March 23, 2025
EVల బీమాకు భారీగా పెరిగిన డిమాండ్

ఎలక్ట్రిక్ వాహనాల బీమాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగినట్లు పాలసీబజార్ అంతర్గత డేటా చెబుతోంది. EV కార్ల బీమా పాలసీల వాటా FY23లో కేవలం 0.50%గా ఉండగా, మార్చి 2025 నాటికి 14%కి విస్తరించి 8.2% వద్ద నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై సిటీల్లో ఈవీల వాడకం ఎక్కువగా ఉందని, 55% బీమా పాలసీలు ఈ నగరాల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.
News March 23, 2025
కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.
News March 23, 2025
మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.