News February 3, 2025

సూర్యాపేట: సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. మొదటి సారి సీసీ కెమెరాలో నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.

Similar News

News January 19, 2026

జగిత్యాల: ‘సుపరిపాలనతో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి’

image

జగిత్యాల జిల్లా న్యాక్ సెంటర్ (నూకపల్లి)లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రారంభించారు. గ్రామాల్లో సుపరిపాలన అందించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పన్నుల వసూలు, బడ్జెట్ రూపకల్పన, పారిశుధ్యం, అభివృద్ధి పనులపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు.

News January 19, 2026

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకం: కలెక్టర్

image

గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కేటాయించే నిధులను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా వినియోగించి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని, గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచులు చొరవ చూపాలని, పల్లెల రూపురేఖలు మార్చాలని పిలుపునిచ్చారు.

News January 19, 2026

పోలాండ్ మంత్రికి ముఖం మీదే ఇచ్చిపడేసిన జైశంకర్!

image

పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్‌స్కీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోలాండ్ జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని, భారత్ పొరుగు దేశాల్లో (పరోక్షంగా పాక్‌లో) ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని గట్టిగా చెప్పారు. గత ఏడాది పాక్ పర్యటనకు వెళ్లిన సికోర్‌స్కీ కశ్మీర్‌పై పాక్ వాదానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జైశంకర్ నేరుగా చురకలంటించారు.