News April 28, 2024

సూర్యాపేట: ‘100 మంది మృతి.. 200 మంది దివ్యాంగులుగా మారారు’

image

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ.. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని తమ విచారణలో తెలుస్తోందన్నారు. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దని సూచించారు.

Similar News

News October 25, 2025

నల్గొండ: పెరగనున్న ఎరువుల ధరలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చే యాసంగి సీజన్లో సాగుచేసే పంటలకు వేసే ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. తాజాగా కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు సంచికి రూ.50 పెరగ్గా మరి కొన్నింటికి 50కిలోల బస్తాపై రూ.25 నుంచి రూ.వంద వరకు ధరల పెంపు ఉంటుందని ఎరువుల దుకాణాల డీలర్లకు కంపెనీలు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం పాత నిల్వలు ఉండడంతో గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. పెరగనున్న ఎరువుల ధరలు రైతులకు భారం కానున్నాయి.

News October 25, 2025

NLG: బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారో..!

image

డీసీసీలు ఇవాళ ఖరారు కానున్నారు. ఢిల్లీలో అధిష్ఠానంతో రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను యూనిట్‌గా తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎంతమంది ఉండాలన్నది నిర్ణయించి అధ్యక్షులను ఖరారు చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

News October 25, 2025

NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

image

బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.