News April 28, 2024

సూర్యాపేట: ‘100 మంది మృతి.. 200 మంది దివ్యాంగులుగా మారారు’

image

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ.. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని తమ విచారణలో తెలుస్తోందన్నారు. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దని సూచించారు.

Similar News

News April 15, 2026

దేవరకొండ: SBI బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిపై కేసు నమోదు

image

దేవరకొండ SBI బ్యాంకులో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి చక్రపాణిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని పలు శాఖలలో లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాల నుంచి చక్రపాణి తన ఖాతాలోకి రూ.2.65 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. బ్యాంకు ఖాతాదారుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిబ్బంది 89 లక్షల రూపాయలు రికవరీ చేశారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో చక్రపాణిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News April 14, 2026

హాలియా: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

అనుముల మండల కేంద్రమైన హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

News April 14, 2026

నార్కట్‌పల్లి: కారులో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

image

నార్కట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఇంటి ముందున్న కారులోకి వెళ్లిన పేర్ని చరణ్య (5) ఊపిరాడక స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఆస్పత్రికి చేరుకుని తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.