News January 27, 2025
సూర్యాపేట: 6 నెలల క్రితమే ప్రేమ వివాహం.. దారుణ హత్య

సూర్యాపేట శివారులో మూసీ కాల్వకట్టపై మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(మాల బంటి) అనే యువకుడు <<15276798>>దారుణ హత్యకు<<>> గురయ్యాడు. ఆరు నెలల క్రితం కృష్ణతో వివాహమైందని అతని భార్య భార్గవి తెలిపింది. తన భర్తను హత్య చేశారని, న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 22, 2025
సూర్యాపేట కలెక్టరేట్‌లో కదలని ఇందిరమ్మ ఇండ్ల ఫైల్స్

సూర్యాపేట కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాజిరెడ్డిగూడెంకి చెందిన వికలాంగురాలు చనగాని లక్ష్మమ్మ- లింగయ్య దంపతులకు ఇల్లు మంజూరు కాగా వివరాలు తప్పుగా పడటంతో మళ్లీ MPDO తప్పును సరిచేసి కలెక్టరేట్‌కు పంపారు. సంబంధిత అధికారులు పత్రాలను నెలరోజులు గడుస్తున్న కన్నెత్తి చూడడం లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
News October 22, 2025
25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>