News March 20, 2025
సూర్యాపేట: 90 వేల మంది రైతులకు జమ కానున్న డబ్బులు

రైతు భరోసాకు ఈ బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటికే మూడు ఎకరాలలోపు ఉన్న 1.50 లక్షల మంది రైతులకు ఈ నిధులు అందాయి. ఇక మిగిలిన 90వేల మంది రైతులకు డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి.
Similar News
News February 25, 2026
ADB: ఉదయం కూతురి నిశ్చితార్థం.. రాత్రి తండ్రి మృతి

బోథ్‌లో మంగళవారం విషాదం జరిగింది. కుమార్తె నిశ్చితార్థం ముగిసిన కొద్ది గంటల్లోనే తండ్రి మరణించడంతో ఆ ఇంట్లో విషాదం నిండుకుంది. పందిరి శంకర్ తన కుమార్తె నిశ్చితార్థాన్ని సోమవారం ఘనంగా జరిపించారు. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుండగానే, అదే రాత్రి ఆయన నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. పెళ్లి పీటలపై కూతురిని చూడాల్సిన తండ్రి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
News February 25, 2026
టెన్షన్ వద్దు.. మీ గెలుపు మీ చేతుల్లోనే!

TG: ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి MAR 18 వరకు బిగ్ డేస్. ఇవాళ్టి నుంచే వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. టెన్షన్ పడితే తెలిసినవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే కూల్‌గా ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లండి. ప్రశ్నపత్రం చూడగానే కంగారు పడకుండా మీకు బాగా వచ్చిన ప్రశ్నలతోనే మీ స్కోరింగ్ వేటను ప్రారంభించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి నిమిషాన్ని తెలివిగా వాడుకోండి. ALL THE BEST
News February 25, 2026
KMR: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి మార్చి 17 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో 17,953 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 9,013 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,940 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 37 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.


