News March 25, 2025

సూర్యాపేట: CM రేవంత్ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

image

CM రేవంత్ ఈ నెల 30 ఉగాదిన సూర్యాపేట జిల్లా HNRకు రానున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Similar News

News September 17, 2025

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం

image

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి, రైతులను పంట వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 2025-26 సంవత్సరం PM కిషన్ అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత అక్టోబర్‌లో విడుదల చేస్తామని చెప్పారు. అకౌంట్ నంబర్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచించారు.

News September 17, 2025

బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌ ఎంత నష్టపోయేది?

image

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచ్‌ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.

News September 17, 2025

మంచిర్యాల: ‘మనువాద వ్యవస్థపై పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పెరియార్’

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో ఏళ్ల నుంచి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన సంఘ సంస్కర్త పెరియార్ అని కొనియాడారు. బహుజన సమాజం ఆయన మార్గంలో నడవాలని కోరారు.