News March 27, 2025

సూర్యాపేట: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం NLG, SRPT, BNGR డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News July 11, 2025

GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

image

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News July 11, 2025

HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

image

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.

News July 11, 2025

‘కొండ’ను ఢీకొనడం కష్టమే..!

image

నలుగురు ఎమ్మెల్యేలు జట్టుకట్టినా కొండా దంపతులను ఢీకొనడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నలుగురు ఎమ్మెల్యేలు ఏకమై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏకరువు పెట్టినా ఏం చేయలేకతున్నారనే టాక్ ఓరుగల్లులో ఉంది. ఉమ్మడి వరంగల్‌లో 7 స్థానాలను తామే గెలిపించామని, వాళ్లకు అంత సీన్ లేదంటూ కొండా దంపతులు కార్యకర్తలతో బాహాటంగానే చెప్తుండడం చూస్తుంటే నిజమేనని తెలుస్తుంది.