News March 9, 2025
సూర్యాపేట SPది మన నల్గొండే..!

సూర్యాపేట జిల్లా ఎస్పీగా కే.నరసింహ నియమితులైన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం. మహబూబ్నగర్ ఎస్పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీఐజీ కార్యాలయానికి అటాచ్ అయి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తూ తాజాగా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయి ఎస్పీగా వెళ్లారు.
Similar News
News March 10, 2025
నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య అధ్యక్షతన సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకతి లక్ష్మీ నారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్షిస్తారని పేర్కొన్నారు.
News March 10, 2025
నల్గొండ: మగ్గం వర్క్లో మహిళలకు ఉచిత శిక్షణ

నల్గొండ పట్టణ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్ (ఎంబ్రాయిడెరీ)లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ ఈ.రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామని, 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు మార్చి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 10, 2025
NLG: నేటి నుంచి ఇంటర్ పేపర్ వ్యాల్యూయేషన్

ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుందని డీఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు.. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందనన్నారు. మిగిలిన సబ్జెక్టులు ఈనెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.