News March 9, 2025
సూర్యాపేట SPది మన నల్గొండే..!

సూర్యాపేట జిల్లా ఎస్‌పీగా కే.నరసింహ నియమితులైన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం. మహబూబ్‌నగర్ ఎస్‌పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీఐజీ కార్యాలయానికి అటాచ్ అయి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తూ తాజాగా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయి ఎస్‌పీగా వెళ్లారు.
Similar News
News February 9, 2026
సిద్దిపేట: ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య

సిద్దిపేట సమీపంలోని పెద్దలింగారెడ్డిపల్లి శివారులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులు నారాయణరావుపేటకు చెందిన శ్రావణ్, పెద్దకోడూరుకు చెందిన నవ్యగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబాలు వారి ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News February 9, 2026
పల్లె కన్నీరు పెడుతోంది: కొలికపూడి

AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌తో రాజకీయ చర్చ మొదలైంది. పల్లెల్లో మౌలిక వసతులు, యువతకు ఉపాధిలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వాట్సాప్ స్టేటస్‌లో ‘3 రోజులు, 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లులేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు. పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల కొలికపూడి-MP కేశినేని చిన్ని మధ్య స్టేటస్ వార్ జరిగిన విషయం తెలిసిందే.
News February 9, 2026
ఎన్నికలకు 750 మందితో పటిష్ఠ బందోబస్తు: శబరీష్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు 750 మద్ది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. MHBD పట్టణంలోని డిగ్రీ కళాశాల, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎస్పీ సందర్శించి, భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 5 డీఎస్పీలు,16 సీఐలు, 27 ఎస్‌ఐలు సహా మొత్తం 750 మంది సిబ్బంది ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తారన్నారు.


