News August 13, 2024

సూళ్లూరుపేటలో పటిష్ఠ చర్యలు

image

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు శ్రీహరికోటకు చేరుకుంటున్నారు. వారికి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కార్మికులు రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు.

Similar News

News September 10, 2024

నెల్లూరు జిల్లాలో ర్యాట్ ఫీవర్?

image

అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురవ్వగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరావు వివరణ ఇచ్చారు. ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగేనీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందన్నారు.

News September 10, 2024

నేడు నెల్లూరు, కావలిలో జాబ్ మేళా

image

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 10న నెల్లూరు, కావలిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.వినయ్ కుమార్ తెలిపారు.పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఉన్నత చదువులు చదివిన వారు అర్హులన్నారు. ఆరోజు ఉదయం 10.30 నుంచి నెల్లూరు దర్గా మిట్టలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల , కావలి R&B, జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యాలయాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.

News September 10, 2024

జిల్లాలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు: కలెక్టర్ ఆనంద్

image

ఈనెల 14 నుంచి అక్టోబర్ 2 వరకు స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత పేరుతో నెల్లూరు జిల్లాలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో 15 మంది అధికారులతో ప్రత్యేక స్టీరింగ్ కమిటీని నియమించామన్నారు. జిల్లా వ్యాప్తంగా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించాలన్నారు.