News July 29, 2024
సూళ్లూరుపేటలో పలు లాడ్జీలపై పోలీసుల తనిఖీలు

సూళ్లూరుపేట పట్టణంలోని పలు లాడ్జీలపై SI రహీం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లాడ్జిల్లో బసచేసే కస్టమర్ల వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని, అందరి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, చట్ట విరుద్ధంగా ఎవరికి గదులు ఇవ్వవద్దన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ASI రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.


