News July 13, 2024

సూళ్లూరుపేటలో మహిళ మృతి

image

సూళ్లూరుపేటలో శనివారం విషాదం నెలకొంది. కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన ఎర్రబోతు ఇందిరమ్మ, భర్త చెంచురామయ్య శనివారం రైల్వే స్టేషన్ వీధిలోని ఓ ఇంటి వద్దకు బెల్దారి పనికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ఇందిరమ్మ చీర, వెంట్రుకలు మిల్లర్‌లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆమె మొండెం, తల వేర్వేరు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News February 27, 2026

తిరుమలలో కొత్త విధానం..!

image

తిరుమలలో భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హుండీలో వేయవచ్చు. దీనిపై TTD బోర్డు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పత్రానికి సంబంధించి ఓ నమూనాను పై ఫొటోలో చూడవచ్చు.

News February 27, 2026

మనుబోలు: రూ.4లక్షలతో పెట్రోల్ బంక్ ఉద్యోగి పరార్

image

నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News February 27, 2026

నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

image

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.