News November 29, 2024
సూళ్లూరుపేటలో రోడ్డు ప్రమాదం..యువకుడు స్పాట్ డెడ్

సూళ్లూరుపేట మండలం కొన్నెంబట్టు గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట నుంచి బైకుపై వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దొరవారి సత్రం మండలం పోలిరెడ్డి పాలెంకు చెందిన ధనుంజయ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు గతంలో వాలంటీర్‌గా దొరవారి సత్రం మండలంలో పనిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
ఆత్మకూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురు

ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం గ్రామం నుంచి పశువులు మేపుకునేందుకు నదిలోకి వెళ్లిన కాపర్లు ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో నది మధ్యలో చిక్కుకున్నారు. వారిలో వెంకట రమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, కవిత, చెన్నయ్యతోపాటు మరో మహిళ ఉన్నట్లు సమాచారం. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలో దిగారు.
News November 22, 2025
మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.
News November 22, 2025
నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

నెల్లూరు రూరల్‌లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


