News April 2, 2025
సూళ్లూరుపేటలో విషాదం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో విషాద ఘటన జరిగింది. స్థానిక KRP షార్ కాలనీలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఎద్దుల నాగరాజు(41) లోపలకు దిగాడు. ఈక్రమంలో అతను మృతిచెందాడు. దావాదిగుంటకు చెందిన నాగరాజు గత 15 ఏళ్లుగా షార్ పరిధిలో కాంట్రాక్టర్ వర్కర్గా పనిచేస్తున్నాడు.
Similar News
News November 18, 2025
పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.
News November 18, 2025
మెదక్: బాలుడిపై దాడి చేసిన పినతండ్రి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు

మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. అక్కన్నపేటకు చెందిన ముత్యం సత్యనారాయణ, వంశి అనే బాలుడిని ఈనెల 13న మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను మంగళవారం రిమాండ్కు తరలించారు.
News November 18, 2025
మెదక్: ‘డ్రగ్స్ నిర్మూలనకు ముందుకు రావాలి’

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది, అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం రవాణా అక్రమ విక్రయం వంటి కార్యకలాపాలు యువత భవిష్యత్ను దెబ్బతీస్తాయన్నారు. అరికట్టడానికి పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.


