News October 3, 2024

సూళ్లూరుపేటలో వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 3, 2024

చండీ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి

image

నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

News October 3, 2024

పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు; కలెక్టర్

image

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు అని అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సేవలు చిరస్మరణీయం అని అన్నారు.

News October 2, 2024

చేజర్ల ఎమ్మార్వో నుంచి రూ.3.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

చేజర్ల తహశీల్దార్‌‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్‌ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.