News October 3, 2024
సూళ్లూరుపేటలో వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 11, 2025
నెల్లూరు కలెక్టర్‌కు 2వ ర్యాంకు

నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.
News December 11, 2025
నెల్లూరు: నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్

నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. ప్రతి బృందానికి SI స్థాయి అధికారి ఇన్‌ఛార్జ్‌గా ఉంటారని చెప్పారు. జిల్లాలో 6 స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వ్యవస్థను మరింత చురుగ్గా, సమయస్ఫూర్తితో సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
News December 11, 2025
15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి

నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.


