News January 30, 2025
సూళ్లూరుపేట: ఇస్రో ఇప్పటివరకు చేసిన రాకెట్ ప్రయోగాలివే

SLV-3 నాలుగు మిషన్లుగా ప్రయోగం చేశారు. ASLV – నాలుగుసార్లు, అత్యధికంగా PSLV- 62సార్లు రాకెట్ ప్రయోగం చేశారు. GSLV- 16 సార్లు, LVM3- ఏడు సార్లు, SSLV- మూడు సార్లు, అత్యల్పంగా RLV- , TV- , PT- మిషన్లు ఒకొక్కసారిగా మొత్తం 99 ప్రయోగించారు. అయితే నిన్న ప్రయోగించిన 100వ GSLV -F15 రాకెట్ మంటలు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లి మరుపురాని విజయ ఢంకా మోగించింది. హ్యాట్సాఫ్ ఇస్రో.
Similar News
News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా UPDATES

భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 578 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,03,000 మంది ఓటర్లు ఉన్నారు.
News February 16, 2025
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
News February 16, 2025
దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం

TG: సంగారెడ్డి(D) ఫసల్‌వాదిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని ఓ తండాకు చెందిన దంపతులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ నెల 2న అనంతపురం జిల్లాకు కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫసల్‌వాదిలోని ఓ విద్యాపీఠంలో భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయారు. పెయింటింగ్ పనులు చేసే మాథవన్ (34) భర్తను ఘోరంగా కొట్టి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశారు.