News August 16, 2024

సూళ్లూరుపేట: ఇస్రో SSLV-D3 ప్రయోగం విజయవంతం

image

శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News September 8, 2024

నెల్లూరు: అంగన్వాడీలకు 4నెలలుగా అందని కందిపప్పు

image

నెల్లూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో 2934 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో లక్ష 25వేలు మంది చిన్నారులు, 25వేలు గర్భవతులు బాలింతలు కలరు. వీరికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో కందిపప్పు అందించాల్సి ఉంది. కందిపప్పు సరఫరా లేకపోవడంతో కేంద్రాల్లో ఆకుకూరలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.

News September 8, 2024

NLR: ఆరు నెలలుగా అందని జీతాలు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. పస్తులు ఉండాల్సి వస్తోందని చెప్పారు. రూ.16 వేలు జీతానికి రూ.12 వేలే ఇస్తున్నారని ఆరోపించారు. గత మూడేళ్లుగా పీఎఫ్, ఈఎస్ఐ నగదు ఇవ్వడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 8, 2024

కావలి: మత్తులో వ్యక్తి వీరంగం

image

కావలి ట్రంక్ రోడ్ అంబేడ్కర్ సర్కిల్ బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఓ వ్యక్తి పోలీసుల ముందే వీరంగం సృష్టించాడు. దీంతో బ్రిడ్జి సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు అతడిని పక్కకు పంపే ప్రయత్నం చేయగా.. వారిపైనే ఎదురు తిరిగాడు. కష్టం మీద పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మత్తు దిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.