News March 21, 2024
సూళ్లూరుపేట ఘటనలో ఇద్దరు మృతి

సూళ్లూరుపేట మదీనా టపాసుల గోడౌన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చెన్నైకి తరలించారు. ఇందులో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకుమార్, రవి శరీరం 90 శాతం కాలిపోయింది. వీళ్లు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సూళ్లూరుపేట ఎస్ఐ రహీం వెల్లడించారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
వరి A గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధర

కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధర(క్వింటాకు) ప్రకటించింది. వరికి A గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చెల్లించనున్నారు. మొక్కజొన్నకు రూ.2400, పత్తిపొడవు రకం రూ. 8110, మినుములు రూ.7800, పెసలు రూ.8768, కందులు రూ.8000, జొన్నలు రూ.3699, నువ్వులు రూ.9846, సజ్జలు రూ.2775, రాగులు రూ.4886, వేరుశనగకు రూ.7263 చొప్పున మద్దతు ధరలను ప్రకటించింది. పోస్టర్‌ను JC వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.
News October 24, 2025
జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం: మంత్రి ఆనం

జిల్లాను అన్నీ రంగాల్లో ముందు నిలపాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ మంత్రిని కలిసి అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై, వర్షాలకు చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కోరారు.
News October 24, 2025
స్వర్ణాంధ్ర లక్ష్యసాధన దిశగా అడుగులు: దినకర్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్’లో భాగంగా 2047 కల్లా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ మంత్రి ఆనంతో చర్చించారు. ఈ మేరకు దినకర్ మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఆహార భద్రత, పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, జిల్లాల అభివృద్ధి సూచికలు, పీఎం ధన ధాన్య కృషి యోజన అంశాలపై వారు చర్చించారు.


