News February 10, 2025

సూళ్లూరుపేట: చలి కాచుకుంటున్న లేగ దూడలు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటలో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువై దట్టమైన పొగ మంచు కమ్మేసి మనుషుల్నే కాదు జంతువులను సైతం వణికిస్తోంది. దీంతో మనుషులే కాదు పశువులు సైతం చలికాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పచ్చని పచ్చిక బయళ్లలో, పశుశాలల్లో పెరగాల్సిన గోవులను వాటి యజమానులు రోడ్ల మీద వదిలివేయడంతో అవి దయనీయ స్థితిలో బతుకుతున్నాయని పశు ప్రేమికులు వాపోతున్నారు.

Similar News

News March 27, 2025

ఆత్మకూరు హైవే పక్కన అస్థిపంజరం లభ్యం

image

ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అల్లిపురం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని పూర్తిగా ఎముకల గూడుగా ఉన్న అస్థిపంజరం లభ్యమయింది. ఈ అస్థిపంజరం మగ వ్యక్తిదని, చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 58-60 ఏళ్ల మధ్య ఉండొచ్చని ఆత్మకూరు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా ఈ శవం ఆనవాళ్లను గుర్తిస్తే 9440796390 నంబరుకు వివరాలు తెలియజేయాలని SI కోరారు.

News March 27, 2025

నెల్లూరు: టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

image

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో C.y.T.B లేటెంట్ క్షయ వ్యాధి నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి. సంబంధిత కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుజాత, డాక్టర్ ఖాదర్ వలీ బుధవారం ప్రారంభించారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. ఈ పరీక్ష ద్వారా క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు. టీబీ నివారణ వ్యాక్సిన్లు జిల్లాలోని అన్ని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.

News March 26, 2025

నెల్లూరు: ఉచిత DSC కోచింగ్‌కి ఎంపికైన వారి వివరాలివే.!

image

నెల్లూరు జిల్లాలో ఉచిత DSC కోచింగ్‌కి ఎంపికైన S.C, S.T అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను కింది 2 వెబ్సైట్‌లలో పొందుపరిచారు. కాబట్టి DSC ఉచిత కోచింగ్‌కి దరఖాస్తు చేసుకున్న వారు చెక్ చేసుకోవాలని, నెల్లూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి తెలియజేశారు.
➤ https://mdfc.apcfss.in
➤https://jnanbhumi.ap.gov.in 

error: Content is protected !!