News February 10, 2025
సూళ్లూరుపేట: చలి కాచుకుంటున్న లేగ దూడలు

సూళ్లూరుపేటలో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువై దట్టమైన పొగ మంచు కమ్మేసి మనుషుల్ని కాదు జంతువులు సైతం వణికిస్తుంది. దీంతో మనుషులే కాదు పశువుల సైతం చలికాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పచ్చని పచ్చిక బయళ్లలో, పశుశాలల్లో పెరగాల్సిన గోవులను వాటి యజమానులు రోడ్ల మీద వదిలివేయడంతో అవి దయనీయ స్థితిలో బతుకుతున్నాయని పశు ప్రేమికులు వాపోతున్నారు.
Similar News
News March 21, 2025
సమీకృత పంట కుంటల ప్రాధాన్యాన్ని చాటిచెప్పండి: కలెక్టర్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో సమీకృత నీటికుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉపాధి హామీ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.
News March 21, 2025
BREAKING: పరీక్ష వాయిదా

AP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2025-26కు గాను ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీన్ని అదే నెల 13న నిర్వహిస్తామని తెలిపింది.
News March 21, 2025
‘టాక్సిక్’ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్న కియారా!

రాకింగ్ స్టార్ యశ్, కియారా కాంబోలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా మారనున్నట్లు వెల్లడించాయి. కాగా, SSMB29 కోసం ప్రియాంకా చోప్రా రూ.30 కోట్లు తీసుకుంటున్నారని టాక్.