News January 19, 2025

సూళ్లూరుపేట: పర్యాటకులకు ఉచిత బస్సు సౌకర్యం

image

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చే పర్యాటకుల కోసం సూళ్లూరుపేట నుంచి ఆది, సోమవారాల్లో (19,20 తేదీలు) అటకానితిప్ప, నేలపట్టు, బీవీ పాలెం పర్యాటక ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 18, 2025

నెల్లూరు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

image

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.

News February 18, 2025

నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

News February 18, 2025

నెల్లూరు: సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

image

సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతైన ఘటన TP గూడూరు(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెం పట్టపుపాలెం గ్రామానికి చెందిన కే.వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి తీరానికి చేరుకోలేదు. తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకూరుపేట(M), కొరుటూరు సమీపంలో మృతదేహం కొట్టుకొచ్చింది. తోటపల్లి గూడూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

error: Content is protected !!