News April 3, 2024
సూళ్లూరుపేట: పెన్షన్ కోసం వచ్చి మహిళ మృతి

పెన్షన్ కోసం వచ్చి ఓ మహిళ మరణించిన ఘటన బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… సూళ్లూరుపేట పట్టణం సాయినగర్‌కు చెందిన లలితమ్మ (58) అనే మహిళ పెన్షన్ కోసం మధ్యాహ్నం నుంచి స్త్రీ శక్తి భవనం వద్ద పడిగాపులు కాచింది. పెన్షన్ ఆలస్యం కావడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News April 18, 2025
నెల్లూరు ప్రజలకు పోలీసుల కీలక సూచన

నెల్లూరు జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కావలి పట్టణంలో ఇదే తరహాలో ఊరు చివర కారు పెట్టుకుని ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. వైట్ షిఫ్ట్ కారు ఊరి శివారు ఏరియాలో ఉంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News April 18, 2025
నెల్లూరు: 26 మందికి రూ.74.57లక్షల పంపిణీ

నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి ఆర్థిక సహాయంతో నెల్లూరు జిల్లాకు చెందిన 26 మంది దివ్యాంగులకు రూ.74,57,500 చెక్కులను జాయింట్ కలెక్టర్ కార్తీక్ పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పనులు చేసుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ఏ.మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు.
News April 17, 2025
నెల్లూరు: 3.69 లక్షల ఎకరాలకు సాగునీరు

నెల్లూరు జిల్లాలో 3.69 లక్షల ఎకరాల రెండో పంటకు నీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నెల్లూరులోని జడ్పీ హాలులో ఐఏబీ సమావేశం జరిగింది. 41 టీఎంసీల జలాలను రెండో పంటకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ విషయంలో సాగునీటి సంఘాల ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.