News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

నెల్లూరు: రూ.1,566 కోట్ల పెట్టుబడి.. 400మందికి ఉపాధి

image

రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 22726 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు పలు పరిశ్రమలు ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలకు SIPC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న SIPC భేటీలో ఆమోదించాల్సి ఉంది. కృష్ణపట్నంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ (రిలయన్స్) రూ.1,566 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ పార్కు స్థాపించనుంది. దీంతో 400 మందికి ఉపాధి కలగనుంది.

News February 19, 2025

నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

image

నెల్లూరు నగరంలోని కపాడిపాలెంకు చెందిన షేక్ కరీముల్లాకు పోక్సో కేసులో పదేళ్ల జైలు శిక్ష రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 4, 2015 నగరంలోని సంతపేట చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుడ్ ట్రైల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణ కాంత్ అభినందించారు.

News February 19, 2025

నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

error: Content is protected !!