News November 16, 2024

సూళ్లూరుపేట: మహిళతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్

image

సత్యవేడు మండలం ఆరూరులో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన స్టాలిన్ అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీసిటీ డిఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు‌. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూకు వెళుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Similar News

News December 14, 2024

నెల్లూరు: కోడిగుడ్డు ధర రూ.10? 

image

నెల్లూరు జిల్లాలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర పలు ప్రాంతాల్లో రూ.7.50కు చేరింది. వారం రోజుల క్రితం వరకు ఈ ధర రూ.5 నుంచి రూ.6 వరకు ఉండేది. వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గుడ్డు ధరలకు రెక్కలు వచ్చినట్లు స్థానికులు వాపోయారు. మరిన్ని రోజుల్లో ఈ ధర రూ.10కు చేరొచ్చని వ్యాపారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.  

News December 14, 2024

నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు

image

నేడు నెల్లూరు జిల్లాలోని 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, 490 వాటర్ యూజర్ అసోసియేషన్లు, 3,698 టీసీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2.95లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలకు 9,120 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.

News December 13, 2024

నెల్లూరు: రేపు పాఠశాలలకు సెలవు రద్దు

image

రేపు రెండో శనివారం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.బాలాజీ రావు తెలిపారు. అక్టోబర్ నెలలో వర్షాల వలన సెలవులు ఇచ్చినందున ఈ నిర్ణయం జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరంలో 220 పని రోజులు కచ్చితంగా పాఠశాలలు పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు.