News September 14, 2024
సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం

సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.
Similar News
News November 14, 2025
గుడ్లూరు: హైవేపై విషాదం.. దంపతులు మృతి

గుడ్లూరు (M)మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో NTR(D) జి కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.
News November 13, 2025
నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.
News November 13, 2025
జగన్తో మాజీ మంత్రి అనిల్ భేటీ

తాడేపల్లిలో YCP అధినేత జగన్ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.


