News October 12, 2024
సూళ్లూరుపేట: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు!

కవరైపెట్టె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్(12578) ఢీకొనడం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉన్నట్లు భారతీయ రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)తో విచారణ చేయించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలుస్తాయని దక్షణమధ్య రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ తెలిపారు. తిరవళ్లూరు వద్ద పనులు చేపట్టి రైళ్ల రాకపోకలు పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామన్నారు.
Similar News
News February 7, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.
News February 6, 2026
నెల్లూరు జిల్లాలో రైతులకు లోన్లు రావడం లేదు..!

నెల్లూరు జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ప్రస్తుత ప్రభుత్వంలో మళ్లీ వాటిని చుక్కల భూములుగా చూపారని పలువురు రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు 1బి అడంగల్ తీసుకు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చుక్కల భూములకు 1బి అడంగల్ ఇవ్వడం లేదు. దీంతో రైతులకు రుణాలు అందక అవస్థలు పడుతున్నారు.
News February 6, 2026
నెల్లూరు జిల్లాలో టీచర్‌ను కాపాడిన స్టూడెంట్

ఉదయగిరి మండలం గండిపాలెం జడ్పీ స్కూల్లో తెలుగు టీచర్ కేసీ మాలకొండయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 10వ తరగతి విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ్ వెంటనే గమనించి టీచర్‌కు CPR చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత ఆయనను నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సకాలంలో స్పందించి టీచర్ ప్రాణాలు నిలిపిన విద్యార్థికి పలువురు అభినందనలు తెలిపారు.


