News July 27, 2024
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో సర్పంచ్ మృతి

సూళ్లూరుపేట మండలం కుదిరి పంచాయతీ సర్పంచ్, వైసీపీ నాయకుడు బుంగ చంగయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 16, 2025
నేటి నుంచి పండగ (ధనుర్మాసం ) నెల ప్రారంభం

నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు. గుమగుమలాడే వివిధ రకాల పిండి వంటలు చేసే పనులు నిమగ్నం అవుతారు.
News December 16, 2025
ఇంకా గోవాలోనే కార్పొరేటర్లు, 18న నెల్లూరుకు రాక

నెల్లూరు కార్పొరేషన్లోని కార్పొరేటర్లు అందరూ ఇంకా గోవాలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 38 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు గోవాకు వెళ్లారు. తిరిగి 17వ తేదీ తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి 18వ తేదీ ఉదయానికి కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరవుతారు. అవిశ్వాస తీర్మానం లేకపోవడంతో సాధారణ సమావేశం జరగనుంది.
News December 16, 2025
నెల్లూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నెల్లూరు విజయమహల్ వద్ద జరిగింది. విజయవాడ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు నెల్లూరు రైల్వే SI హరిచందన తెలిపారు. అతడు ఎరుపు రంగు ఆఫ్ హాండ్స్ టీ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందన్నారు.


