News February 24, 2025
సూళ్లూరుపేట వద్ద BUS బోల్తా

సూళ్లూరుపేట NHపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పాండిచ్చేరి నుంచి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో 17 మంది గాయపడగా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. SI బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 15, 2025
ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొంటాం: మంత్రి మండిపల్లి

APSRTCని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇకపై డీజిల్ బస్సులను కొనబోమని, రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్త్రీ శక్తి పథకం బాగా నడుస్తోందని, దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మౌనం వహించారని ఎద్దేవా చేశారు.
News November 15, 2025
39,506 మారుతీ గ్రాండ్ విటారా కార్లు వెనక్కి

సాంకేతిక సమస్యలు తలెత్తిన గ్రాండ్ విటారా మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2024 DEC 9 నుంచి 2025 APR 29 వరకు తయారైన 39,506 కార్లలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సిస్టమ్‌లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్స్‌లో ఆ కార్లను పరీక్షించి లోపాలున్న పరికరాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది.
News November 15, 2025
ప.గో జడ్పీ కార్యాలయంలో 14 మందికి ప్రమోషన్స్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది దిగువ శ్రేణి సిబ్బందికి పదోన్నతి కల్పిస్తూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ శనివారం ఉత్తర్వులు అందజేశారు. జిల్లా పరిషత్ యాజమాన్యం తమ శ్రమను గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని పద్మశ్రీ సూచించారు.


