News February 7, 2025
సూళ్లూరుపేట హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో ఐస్‌క్రీమ్‌లు విక్రయించే వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేటలో గురువారం రాత్రి జరిగింది. బాలాయపల్లి(మం), గొల్లగుంటకు చెందిన చల్లా వెంకటకృష్ణయ్య ఆటోలో ఐస్ క్రీమ్‌లు విక్రయించేవాడు. ఆయన ఐస్‌క్రీమ్ ఆటోలో సూళ్లూరుపేటకు వస్తుండగా ఆర్‌టీసీ డిపో సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News February 27, 2026
బాలిక హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.
News February 27, 2026
అనంతపురం: ఉపవాస దీక్షలో ఉన్న కానిస్టేబుల్ మృతి

అనంతపురం నగరంలో 3-టౌన్‌కు చెందిన నజీరుద్దీన్ ఆకస్మికంగా మృతి చెందారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. 1804 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ నసీరుద్దీన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణం వారి కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
News February 27, 2026
యాదాద్రి: రైతులకు అలర్ట్.. రెండు రోజులే గడువు

ప్రభుత్వ పథకాల లబ్ధికి తప్పనిసరి అయిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ గడువు ఈ నెల 28తో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 2,81,086 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,56,283 (55.59%) మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. పీఎం కిసాన్ నిధి వంటి పథకాలు పొందాలంటే రిజిస్ట్రీ తప్పనిసరి. రైతు వేదికల్లో, మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు. గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు రైతులను కోరుతున్నారు.


