News March 20, 2025
సెంటర్స్ వద్ద 163 BNSS యాక్ట్ అమలు: SP నరసింహ

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. 67 పరీక్షా కేంద్రాలలో 11,912 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని సూచించారు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలన్నారు.
Similar News
News December 5, 2025
ఈ నెల 8 నుంచి ANU యువజన ఉత్సవాలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యువజన ఉత్సవాలను ఈ నెల 8, 9, 10 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఉత్సవాలను విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీకి మార్చినట్లు తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.
News December 5, 2025
లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్

* నటి, బిగ్బాస్ తెలుగు-3 కంటెస్టెంట్ పునర్నవి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. తన ప్రియుడు హేమంత్ వర్మ(ఫొటోగ్రాఫర్) కశ్మీర్లో చేసిన ప్రపోజల్కు ఓకే చెప్పినట్లు ఆమె ఇన్స్టాలో ఫొటోలు పంచుకున్నారు.
* సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి ‘షో మ్యాన్’ టైటిల్ ఫిక్స్ చేయగా దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుమన్ విలన్గా నటించనున్నారు.
News December 5, 2025
కర్నూలులో వేసవి కోసం ముందస్తు చర్యలు: కలెక్టర్

జిల్లాలో వేసవికాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. చేతి పంపులు, రక్షిత నీటి పథకాలు, పైపులైన్ల లీకేజీలు తదితర మరమ్మత్తులను డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని ఆమె స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పూర్తిగా నింపాలన్నారు. గ్రామాలలో చిన్నపాటి మరమ్మతులను చేయాలని ఆదేశించారు.


