News March 25, 2025
సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్‌ను పరిశీలించిన వరంగల్ కలెక్టర్

వరంగల్ పట్టణంలోని రంగశాయిపేట యూపీహెచ్సీ ప్రాంగణంలోని కేంద్ర ఔషధ గిడ్డంగి (సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్) ను కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఔషధాల స్టాక్ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన సూపర్వైజర్తో పాటు విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News April 2, 2025
టాప్-2లోకి దూసుకొచ్చిన PBKS

LSGపై ఘన విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కాగా ఈ మూడు జట్లు ఇప్పటివరకూ కప్ కొట్టకపోవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో GT, MI, LSG, CSK, SRH, RR, KKR ఉన్నాయి.
News April 2, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త: ఎస్పీ

బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్‌కు దూరంగా ఉండాలని, అవి ప్రాణాలతో చెలగాటమాడుతాయని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి ఓ ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ప్లాట్ఫామ్లో IPL బెట్టింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
News April 2, 2025
అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. నాగర్‌కర్నూల్‌లో ఆందోళన

ఊర్కొండపేటలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ..అక్కడ ఒక గ్యాంగ్ మాటు వేసుకుని ఉందంటే ఈ తతంగం ఇప్పటికిప్పుడు జరిగిందేమీ కాదని, కొంతమంది సహకారం లేకపోతే ఇలాంటి క్రూర, దుర్మార్గమైన ఘటనలు జరగవన్నారు.