News March 15, 2025
సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 17, 2025
అనంతపురం: వివాహితపై అత్యాచారయత్నం

నార్పల సుల్తాన్ పేట కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అదే కాలనీలో ఉండే లక్ష్మణ్ అనే వ్యక్తి కవిత అనే వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకుని, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కవితను లక్ష్మణ్ వేధించేవాడని, అతడే చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కైలుట్లయ్య తెలిపారు.
News March 17, 2025
అనంతపురం: డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్ట్‌లో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.
News March 16, 2025
భారత త్రో బాల్ జట్టుకు ఎంపికైన వెన్నపూస రోషీ రెడ్డి

భారత త్రో బాల్ జట్టుకు అనంతపురానికి చెందిన వెన్నుపూస రోషీ రెడ్డి ఎంపికయ్యారు. భారత పారా త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ ఎంపికైన లేఖను పంపించినట్లు రోషీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ నారాయణ అతడిని అభినందించారు. కంబోడియాలో జరిగే ఆసియా పారా త్రోబాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడనున్నారు.