News July 15, 2024

సెంట్రల్ యూనివర్సిటీ అధికారులతో ఎంపీ భేటీ

image

అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కోరితో సోమవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. యూనివర్సిటీలో మొదటి దశలో జరుగుతున్న నిర్మాణం పనుల పురోగతిపై చర్చించారు. మొదటి దశ పనులు అక్టోబర్ లోపు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో నూతన కోర్సులు ప్రవేశ పెట్టే విధంగా చూడాలని కోరారు.

Similar News

News October 16, 2024

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో అనంతపురం జిల్లాలో వర్షం పడుతోంది. నిన్నటి నుంచి కదిరి, రోళ్ల, ధర్మవరం, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో <<14360726>>కంట్రోల్ రూమ్స్<<>> ఏర్పాటు చేశారు.

News October 16, 2024

సత్యసాయి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. వయోజన విద్య అభివృద్ధిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి గూగుల్ మీట్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

News October 15, 2024

కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన సత్యసాయి జిల్లా జేసీ

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.