News January 10, 2025
సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ
బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.
Similar News
News January 19, 2025
కదిరి నరసింహ సామి సాచ్చిగా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ‘VT 15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
News January 19, 2025
పద్యాలతో జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన: JNTU ఇన్ఛార్జ్ వీసీ
అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2025
అనంత: మాజీ ఎమ్యెల్యే సోదరుడిపై కేసు నమోదు
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై శనివారం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష వెల్లడించారు.