News September 1, 2024
సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యురాలిగా శబరి

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి కేంద్రంలో మరో కీలక పదవి లభించింది. ఆమెను సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమించారు. దేశ వ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని ఈ బోర్డు పర్యవేక్షిస్తుంటుంది. ఈమెతో పాటు మహారాష్ట్రలోని దూలే ఎంపీ డాక్టర్ బచావ్ శోభా దినేశ్‌ను సభ్యురాలిగా కేంద్రం నియమించింది. దీంతో బైరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 23, 2026
ఇంటర్ పరీక్ష.. తొలిరోజు 823 మంది గైర్హాజరు: RIO

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 823 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 26,102 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News February 23, 2026
కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
News February 23, 2026
కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


