News November 10, 2025
సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండరీ ఆసుపత్రులుండగా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుపత్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్దరు చొప్పున, మరో 13 ఏరియా ఆసుపత్రులకు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుపత్రులకు ఇద్దరు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. మరో 97 ఆసుపత్రులకు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.
Similar News
News March 3, 2026
ఖమేనీ కోసం కెమెరాలు, మొబైల్ నెట్‌వర్క్ హ్యాక్?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ ఏళ్లుగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా ఇరాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అక్కడి మొబైల్ నెట్‌వర్క్‌లోకీ చొరబడి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఇది కొన్నేళ్లపాటు జరిగినట్లు వెల్లడించింది. ఖమేనీ బాడీగార్డ్స్ కదలికల్ని స్పష్టంగా పసిగట్టగలిగే కెమెరా ఒకటి బాగా ఉపయోగపడినట్లు సమాచారం.
News March 3, 2026
మా రియాక్షన్ ఏంటో త్వరలోనే తెలుస్తుంది: ట్రంప్

రియాద్‌లోని US ఎంబసీపై ఇరాన్ డ్రోన్లతో <<19285091>>దాడి<<>> చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘మా ఎంబసీపై దాడికి, మా సైనికుల మరణానికి అమెరికా ఇచ్చే సమాధానం ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది’ అని హెచ్చరించారు. అయితే ఇరాన్‌లోకి నేరుగా సైన్యాన్ని పంపాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్లలో ఆ దేశానికి ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
News March 3, 2026
ఆముదం పంట రెండో గెల దశలో ఉందా?

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంట రెండో గెల దశలో ఉంటే నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేసవిలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో ఎండు తెగులు గమనిస్తే లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.


